స్టార్‌ హీరోలకు విజయ్‌ దేవరకొండ షాక్‌ ..!

2016 లో విడుదలైన జనతా గ్యారేజ్ చిత్రం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే . నైజాం లో జనతా గ్యారేజ్ దాదాపు 18 కోట్ల షేర్ సాధించింది . 18 కోట్ల ని దాటి 20 కోట్ల షేర్ సాధించిన చిత్రాలు బాహుబలి , బాహుబలి 2, రంగస్థలం , మగధీర , అత్తారింటికి దారేది , శ్రీమంతుడు , దువ్వాడ జగన్నాథం చిత్రాలు మాత్రమే ఉన్నాయి . ఆ తర్వాత ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ , చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రాలు ఉన్నాయి . ఇప్పుడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు టాలీవుడ్ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ .

అయితే నైజాం లో ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ పేరిట రికార్డ్ ఉంది ,ఆ రికార్డ్ ని ఇప్పుడు విజయ్ దేవరకొండ తన గీత గోవిందం చిత్రంతో బద్దలు కొట్టాడు . ఇప్పుడు మహేష్ బాబు , చరణ్ , ప్రభాస్ రికార్డ్ లపై దృష్టి పెట్టాడు . ఆగస్టు 15న విడుదలైన గీత గోవిందం ప్రభంజనం సృష్టిస్తోంది . ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించగా దాదాపు 60 కోట్ల షేర్ సాధించింది అందులో ఒక్క నైజాం లోనే 18. 60 లక్షలు వసూల్ చేసింది . ఇప్పుడు 20 కోట్ల షేర్ దిశగా నైజాం లో దూసుకుపోతోంది గీత గోవిందం .