HomeTelugu Big Storiesకాజల్ 'ఎంతవరకు ఈ ప్రేమ'!

కాజల్ ‘ఎంతవరకు ఈ ప్రేమ’!

జీవా, కాజల్ అగర్వాల్ జంట‌గా తెర‌కెక్కిన‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కవలై వేండాం’ తెలుగులో ‘ఎంత వరకు ఈ ప్రేమ’ పేరుతో అనువాద‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ‘యామిరుక్క బ‌య‌మేన్‌’ ఫేమ్ డీకే దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెల 7న రిలీజ‌వుతోంది. ఈ సందర్భంగా….
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. ”అన్ని ప‌నులు పూర్తి చేశాం. ఈనెల 7న  సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ‘రంగం’ చిత్రాన్ని త‌మిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను త‌మిళంలో నిర్మించి రిలీజ్ చేశారు. అక్క‌డ పెద్ద విజయం అందుకుని ఇప్పుడు తెలుగులో వ‌స్తోంది. తెలుగు ట్రైల‌ర్స్‌, పాట‌లు ఆక‌ట్టుకున్నాయి. జీవా, కాజ‌ల్ న‌ట‌న యువ‌త‌రానికి క్రేజీగా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల్ని వంద శాతం మెప్పించే చిత్ర‌మిది” అన్నారు.
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu