
Thandel ticket rates:
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన Thandel సినిమా ఫిబ్రవరి 2025లో మొదటి బిగ్ రిలీజ్‌గా రానుంది. సముద్రం నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ కొన్ని నిజ జీవిత ఘటనల ప్రేరణగా రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్‌బస్టర్‌గా మారాయి, దీంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.
సినిమా ప్రమోషన్స్ షురూ కాగా, టీమ్ బాగా జోరు పెంచింది. నగరాలు చుట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ, ఈవెంట్స్‌లో పాల్గొంటూ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఆల్రెడీ పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
View this post on Instagram
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, తండేల్ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధర పెంచేందుకు అప్లై చేసిందట. కొత్త ప్రభుత్వం సినీ పరిశ్రమకు స్నేహపూర్వకంగా ఉండటంతో, రూ. 50/- టికెట్ హైక్ వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే, తెలంగాణలో మాత్రం టికెట్ రేట్లు యథావిధిగా ఉండే సూచనలు ఉన్నాయి.
ఈ పాన్ ఇండియా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 40 కోట్లు వరల్డ్‌వైడ్ షేర్ సాధించాలి. పాటలు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి, పైగా సినిమాపై మంచి టాక్ వస్తే ఈ టార్గెట్ అందుకోవడం పెద్ద కష్టం కాదు. బన్నీ వాస్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించగా, డైరెక్టర్ చందూ మొండేటి కథ, కథనం ఎంత ఎంగేజింగ్ గా అందించారో చూడాలి.
ALSO READ: Thandel బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే..?