HomeTelugu Big Storiesఆర్‌ఆర్‌ఆర్‌: ఎత్తర జెండా సాంగ్‌ ప్రోమో విడుదల

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎత్తర జెండా సాంగ్‌ ప్రోమో విడుదల

Etthara Jenda Song Promo fr
టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న మల్టీస్టారర్లుగా నటించిన మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఎత్తర జెండా అనే సెలబ్రేషన్‌ యాంథమ్‌ ప్రోమోను మూవీ టీం విడుదల చేసింది.

నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా అంటూ సాగే ఈ సాంగ్‌లో తారక్‌, చెర్రీ, ఆలియా కలర్‌ఫుల్‌గా కనిపించారు. ఫుల్‌ సాంగ్‌ను మార్చి 14న విడుదల చేయనున్నారు. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అయిన టీజర్‌, సాంగ్స్‌ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్‌ చేసిన నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!