HomeTelugu Trending'ఎఫ్‌ 3' మూవీ డేట్‌ ఫిక్స్‌

‘ఎఫ్‌ 3’ మూవీ డేట్‌ ఫిక్స్‌

F3 release date

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వెంకటేశ్ – మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఎఫ్ 2’. ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ చేయడానికి సెట్స్ పైకి వెళ్లారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తరువాత ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం లేదు. ఈ సినిమాను మే 27వ తేదీన వదలనున్నట్టుగా అధికారిక ప్రకటన చేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

“పిల్లలు పరీక్షలు ముగించుకోండి .. పెద్దలు సమ్మర్ సందడికై తయారుకండి .. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాము” అంటూ ఈ కొత్త పోస్టర్ ను రిలీజ్‌ చేశారు. భార్యల పోరు పడలేక ఎక్కువ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న భర్తల కథ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu