
Fahadh Faasil Phone:
మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ సెలబ్రిటీగా ఉన్నా, అతని జీవనశైలి మాత్రం చాలా సాదా. తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ కాని ఈ స్టార్, స్మార్ట్‌ఫోన్ కూడా వాడటం లేదట!
అయితే మరింత ఆశ్చర్యంగా ఏంటంటే… ఫహద్ ఫాజిల్ వాడుతున్న ఫోన్ ఖరీదు దాదాపు రూ. 10 లక్షలు. ఈ ఫోన్ గురించి తెలియగానే నెటిజన్లు షాక్ అయ్యారు. ఫహద్ ఫాజిల్ ఇటీవల తన కొత్త సినిమా “Mollywood Times” పూజ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ ఆయన చేతిలో కనిపించిన keypad ఫోన్ వైరల్ అయింది.
ఈ ఫోన్ చాలా సాదాసీదా గా కనిపించినా… ఇది ఏదో సాదా బ్రాండ్ కాదట. ఇది UKకి చెందిన విలాసవంతమైన మొబైల్ ఫోన్ కంపెనీ Vertu తయారు చేసిన “Ascent Retro Classic” మోడల్. ఈ ఫోన్ 2008లో లాంచ్ అయింది. ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యం కాదు.
ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటంటే – టైటానియం బాడీ, సఫైర్ క్రిస్టల్స్, హ్యాండ్-స్టిచ్డ్ లెదర్, ఇంకా 173 గ్రాముల బరువు. దీంట్లో బ్లూటూత్, GPRS, SMS/MMS సపోర్ట్ ఉండటమే కాదు, 170 దేశాల్లో 24/7 కన్‌సియర్‌జ్ సపోర్ట్ ఉండే ప్రత్యేక బటన్ కూడా ఉంది!
ఫహద్ ఫాజిల్ గతంలో మాట్లాడుతూ – “నేను ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండలేదు. ఫేస్‌బుక్ కూడా కాలేజీ రోజుల్లో మాత్రమే వాడాను. ప్రజలతో నేరుగా మాట్లాడడమే నాకు ఇష్టం,” అన్నారు.
ALSO READ: Amitabh Bachchan వారానికి అన్ని కోట్లు సంపాదిస్తున్నారా?













