HomeTelugu Trendingఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సౌండ్ పార్టీ

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సౌండ్ పార్టీ

Sound Party movieబిగ్‌బాస్ ఫేమ్ సన్నీ హీరోగా సౌండ్ పార్టీ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లంత దూరాన సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన హ్రితిక ఇప్పుడు సౌండ్ పార్టీ మూవీలో నటిస్తోంది.

కామెడీ జోనర్‌లో రాబోతున్న సౌండ్ పార్టీ చిత్రానికి సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్నాడు. జయశంకర్ సమర్పణలో ఈ మూవీని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచుతున్నాయి.

Ammayo Lyrical Song | Sound Party | VJ Sunny, Hrithika | Sanjay Sheri |  Mohith Rehamanic - YouTube

సౌండ్ పార్టీ చిత్రం కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుందని నిర్మాతలు చెప్తున్నారు. కుటుంబంలో తండ్రీ కొడుకులు అమాయకులైతే వారి సంపాదన ఎలా చేస్తారనేది కాన్సెప్ట్. ఈ సినిమాను ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. సౌండ్ పార్టీ మూవీలో అలీ, శివన్నారాయణ, సప్తగిరి, పృథ్వి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్ తదితరులు నటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu