HomeTelugu Big StoriesSankranthiki Vasthunnam 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే!

Sankranthiki Vasthunnam 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే!

Sankranthiki Vasthunnam collections in 4 days!
Sankranthiki Vasthunnam collections in 4 days!

Sankranthiki Vasthunnam Collections:

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుని గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

నిజాం ఏరియాలో ఈ సినిమా ఫ్రైడే రోజు రూ. 2.9 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ నాలుగు రోజుల్లో నలభై నాలుగు కోట్లకు పైగా షేర్ ను సాధించింది. శనివారం, ఆదివారం రోజు టికెట్ అమ్మకాలలో భారీ క్రేజ్ ఉండటంతో, తొలి వీకెండ్ చివరికి ఈ సినిమా రూ. 22 కోట్ల షేర్ ను అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ కుటుంబ కథా వినోదాత్మక సినిమా భారీ పోటీ మధ్ మంచి విజయాన్ని అందుకోవడం విశేషం. ప్రస్తుతానికి గేమ్ చేంజర్, డాకూ మహారాజ్ సినిమాల పోటీ ఉన్నప్పటికీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమా స్టడీగా ముందుకు సాగుతోంది.

ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ప్రతి వర్గం ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకుంటోంది. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక కథతో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండగకు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu