HomeTelugu Trendingట్రెండింగ్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్

ట్రెండింగ్‌లో ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్‌ సిరీస్

Family Man2 trending

సమంత నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ ప్మ్యాన్-2’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి సీజన్‌కు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే రెండో సీజన్‌ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్‌ కూడా ఆకట్టుకుంది. ఇందులో సమంత పాత్ర తమిళ టైగర్లను పోలి ఉండటంతో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. తమిళ ప్రేక్షకులు ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలని అంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి కేంద్రానికి లేఖలు కూడా రాశారు.
అయితే తమ సిరీస్ చూశాక ఓ నిర్ణయానికి రావాలంటూ మేకర్స్ దీనిపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత వివాదం కాస్త సద్దుమణిగింది. అప్పటినుంచి ఈ సిరీస్‌పై ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా సైలెంట్‌గా ఉన్నారు మేకర్స్. ఈ సిరీస్‌ ముందుగా ప్రకటించిన ప్రకారం జూన్ 4న అమెజాన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కోసం చాలా ఆసక్తిగా ఉన్నామంటూ ప్రేక్షకులు మాత్రం #Excitedforfamilyman2 అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu