HomeTelugu Trending'మేజర్‌' రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మహేష్‌బాబు

‘మేజర్‌’ రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మహేష్‌బాబు

Major release date announce

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ‘మేజర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ మేకర్స్ ఈ రోజు అధికారిక ప్రకటన చేశారు. ‘మేజర్’ చిత్రం 2022 ఫిబ్రవరి 11న తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మేజర్’విడుదల తేదీని ప్రకటిస్తూ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్‌ చేశారు.

75 లొకేషన్లలో 120 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కోసం 8 భారీ సెట్లు నిర్మించారు. అడివి శేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఇది. శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేజర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ బ్యానర్ లపై ‘మేజర్‌’ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu