HomeTelugu Trendingశర్వానంద్‌, సమంత సినిమా ఫస్ట్‌ లుక్‌

శర్వానంద్‌, సమంత సినిమా ఫస్ట్‌ లుక్‌

3 6
శర్వానంద్‌, సమంత జంటగా తమిళ హిట్‌ ’96’ సినిమా తెలుగు రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ‘జాను’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఎడారిలో ఒంటెలను తాడుతో లాగుతూ శర్వానంద్‌ కనిపించారు. ‘షరతులు, నియమాలు, హద్దులు లేని ప్రేమకు అసలైన నివాళి’ అంటూ ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. సి. ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

’96’లో త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించారు. ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతోపాటు సినీ ప్రముఖుల మెప్పు పొందింది. పాఠశాలలో త్రిష, విజయ్‌ల మధ్య ప్రేమ చిగురించడం.. కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరగడం.. మళ్లీ ఓ సందర్భంలో కలుసుకోవడం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu