HomeTelugu Trending'మేజర్‌' రీలిజ్‌ డేట్‌ వచ్చేసింది

‘మేజర్‌’ రీలిజ్‌ డేట్‌ వచ్చేసింది

Adivi sesh major film relea
టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘మేజర్‌’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన మేజర్‌ ఎట్టకేలకు విడుదలకు సిద్థమైంది. ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 3న మేజర్‌ విడుదలవుతున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్, ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు. ‘శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu