HomeTelugu Trending‘ఎంటో ఏమో జీవితం’ అంటున్న సుమంత్‌

‘ఎంటో ఏమో జీవితం’ అంటున్న సుమంత్‌

First single from malli mod
సుమంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. పెళ్లి, విడాకులు తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్‌ని ఈ సినిమాలో చూపించనున్నారు. నైనా గంగూలీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. కీర్తి కుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘మళ్ళీ మొదలైంది’ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను శనివారం నటుడు నితిన్‌ విడుదల చేశారు. ‘ఎంటో ఏమో జీవితం’ అంటూ సాగే పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. రెడ్‌ సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజశేఖర్‌ నిర్మాత. అనూప్‌ రూబెన్స్‌ సంగీంతం అందిస్తున్నారు. సుహాసిని, పోసాని కృష్ణమురళీ, మంజుల ఘట్టమనేని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu