HomeTelugu Trendingమోహన్‌బాబు ఇంటి వద్ద హల్చల్ చేసిన దుండగుల అరెస్ట్‌

మోహన్‌బాబు ఇంటి వద్ద హల్చల్ చేసిన దుండగుల అరెస్ట్‌

Four persons arrested whichసీనియర్‌ నటుడు మోహన్‌బాబు ఫామ్ హౌస్ వద్ద నలుగురు దుండగులు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఇంటి వద్ద పనిచేసే వాచ్‌మెన్ భయటికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఇంట్లోకి ఏపీ 31 ఏఎన్‌ 0004 నంబర్ గల ఇన్నోవా కారు దూసుకు వెళ్ళింది. వాచ్‌మెన్ వెంటనే సమాచారం ఇవ్వడం తో మోహన్‌బాబు కుటుంబీకులు బయటకు వచ్చారు. కాగా దుండగులు మిమ్మల్ని వదలమంటూ హెచ్చరించి వెళ్లారు. దీంతో భయానికి లోనైన మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పహాడిషరీఫ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు వార్నింగ్ ఇచ్చిన నలుగురు యువకులను గుర్తించారు. మైలార్దేవ్పల్లి దుర్గా నగర్ ప్రాంతానికి చెందిన యువకులుగా గుర్తించిన పోలీసులు గుర్తించారు. ఆ నలుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి కాల్ డేటాను పరీశీలిస్తున్నారు. ఆగంతకులు కావాలనే ఈ పని  చేశారా? లేక ఎవరైనా పంపించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu