
From Chiranjeevi to Vishwak Sen heroes in lady getups:
యంగ్ హీరో Vishwak Sen తాజాగా ఇప్పుడు లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. సినిమాకి సంబంధించిన పోస్టర్, టీజర్ చూస్తే ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ తో ప్రేక్షకులను బాగా అలరించిన విశ్వక్ సేన్ సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకుంటాడు అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఒక హీరో లేడీ గెటప్ లో కనిపించడం ఇది మొదటిసారి కాదు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అల్లు అర్జున్ దాకా ఇప్పటికే చాలామంది హీరోలు అమ్మాయి గెటప్పులు వేసుకుని కూడా ప్రేక్షకులని అలరించారు. అలా లేడీ గెటప్స్ తో ప్రేక్షకులని అలరించిన కొందరు హీరోల గురించి ఒకసారి చూద్దాం.
Allu Arjun:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకసారి కాదు రెండుసార్లు సినిమాలలో లేడీ గెటప్ లో కనిపించారు. తన మొట్టమొదటి సినిమా గంగోత్రి లో లేడీ గెటప్ లో కనిపించిన బన్నీ తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2 సినిమాలో కూడా గంగమ్మ జాతర సీక్వెన్స్ లో లేడీ గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే.
Sree Vishnu:
కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ మంచి విజయాలు అందుకుంటున్న శ్రీ విష్ణు తనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య విడుదల అయిన స్వాగ్ సినిమాలో శ్రీ విష్ణు లేడీ గెటప్ లో కనిపించారు.
Vijay Sethupathi:
ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి ఆ పాత్రకి జీవం పోసే విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్ సినిమాలో ట్రాన్స్ జెండర్ పాత్రలో కనిపించారు. ఆ పాత్ర కోసం చీర కట్టుకొని అమ్మాయి గెటప్ వేసుకున్నారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Siva Karthikeyan:
రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన తమిళ్ హీరో శివ కార్తికేయన్ ఆ సినిమాలో లేడీ గెటప్ వేసుకున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాగానే విజయం సాధించింది
Lawrence – Sarath Kumar:
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కాంచన సినిమాలో లేడీ గెటప్ లో కనిపించారు. అదే సినిమాలో హీరోగా నటించిన రాఘవ లారెన్స్ కూడా లేడీ గెటప్ వేసుకున్నారు.
Nandamuri Balakrishna:
మాస్ హీరో బాలయ్య పాండురంగడు సినిమాలో లేడీ గెటప్ లో కనిపించారు.
Chiranjeevi:
చిరంజీవి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన చంటబ్బాయి సినిమాలో చిరంజీవి అమ్మాయి గెటప్ లో కనిపించారు
Kamal Haasan:
విలక్షణ నటుడు కమల్ హాసన్ భామనే సత్యభామనే, దశావతారం వంటి సినిమాలలో లేడీ గెటప్లో కనిపించి మెప్పించారు.
Vikram:
పాత్ర కోసం ప్రాణం పెట్టేసే విక్రమ్ మల్లన్న సినిమాలో అమ్మాయి గెటప్ లో కనిపించి అందరినీ మెప్పించారు.
Vishal :
వాడు వీడు అనే సినిమాలో విశాల్ కూడా ఒకసారి లేడీ గెటప్ లో కనిపించి అలరించారు.
Manchu Manoj:
పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో ఒక చిన్న పాత్ర కోసం మనోజ్ అమ్మాయి గెటప్ లో కనిపించారు.
Allari Naresh:
యముడికి మొగుడు సినిమాలో నరేష్ అమ్మాయి గెటప్ వేసుకుని కనిపించారు
Rajendra Prasad:
రాజేంద్రప్రసాద్ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలలో ఒకటైన మేడమ్ లో కూడా ఆయన లేడీ గెటప్ వేసుకుని ఉంటారు
Naresh:
చిత్రం భళారే విచిత్రం సినిమాలో నరేష్ అమ్మాయి గెటప్ లో కనిపించారు
Harish Kumar:
ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న హరీష్ కుమార్ ఓహో నా పెళ్ళంట అనే సినిమాలో అమ్మాయి గెటప్ లో కనిపించారు.
హీరోలు మాత్రమే కాక సైడ్ క్యారెక్టర్లుగా చేసిన వాళ్లు కూడా పలు సినిమాల కోసం అమ్మాయి గెటప్లలో కనిపించి ప్రేక్షకులను అలరించారు.
ALSO READ: YS Vivekananda Reddy మీద మరొక సినిమా.. ఎన్ని సెన్సార్ కట్స్ ఉన్నాయంటే!