కళాకారులను శిక్షించాలనుకోవడం తప్పు!

తన పని తాను చేసుకుంటూ.. వార్తలకు దూరంగా ఉండే ప్రియాంక ఎప్పుడైతే హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో.. అప్పటినుండి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవలే ఓ మ్యాగ్జీన్ కు ఇచ్చిన ఫోటోలతో వార్తల్లో నిలిచిన ప్రియాంక ఇప్పుడు పాక్ నటీనటులను బహిష్కరించే విషయంపై స్పందించింది. నాకు దేశభక్తి ఉంది.. ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం మంచిదే.. కానీ కేవలం కళాకారులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో.. అర్ధం కావట్లేదు..రాజకీయనాయకులని, వ్యాపారవేత్తలను ఇలా వివిధ రంగాలకు చెందిన వారిని వేలెత్తి చూపడం లేదు. నాకు తెలిసినంత వరకు పాక్ నటీనటులు ఎవరికి హాని కలిగించలేదు. అలాంటప్పుడు సినీ రంగం నుండి వారిని బహిష్కరించి ఎలా శిక్షిస్తారు. ఎవరో చేసిన పనికి కళాకారులను శిక్షించాలనుకోవడం తప్పు.. అంటూ చెప్పుకొచ్చింది. మరి వీటిపై ఎలాంటి దుమారం చెలరేగుతుందో చూడాలి!
 
 
CLICK HERE!! For the aha Latest Updates