HomeTelugu Trending‘ది టర్న్’ ఫస్ట్ గ్లిమ్ప్స్

‘ది టర్న్’ ఫస్ట్ గ్లిమ్ప్స్

Gautham raju son krishna th
హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది టర్న్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోహర్ వల్లెపు ,లడ్డు ,అరుణ్ కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తుండగా వాసంతి, రత్నమాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కౌశల్ క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై డీబీ దొరబాబు దర్శకత్వంలో భీమినేని శివ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కి ఆర్‌ సారథీ సంగీతం సమకూరుస్తుండగా ప్రదీప్ జంబిగా ఎడిటింగ్ ను అందిస్తున్నారు. విజయ్ ఠాగూర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి ఆయన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. కాగా ఈరోజు హీరో కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత భీమినేని శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ది టర్న్ సినిమా కథ చాలా బాగుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లు మెచ్చే వారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది. మా హీరో కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయన నటన చాలా బాగుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేశాం.. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu