కమల్‌ హాసన్‌కు తమిళనాడు ప్రభుత్వం షాక్?


గత నెలలో నటుడు కమల్‌హాసన్ కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అయితే కరోనా నిబంధనల ప్రకారం కరోనా నుంచి కోలుకున్నా కనీసం వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి. కానీ కమల్ హాసన్ కరోనా నిబంధనలు ఉల్లంఘించి బిగ్‌బాస్‌ షో షూటింగ్‌లో పాల్గొన్నారు. తమిళ వెర్షన్ బిగ్‌బాస్‌కు కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో నటుడు కమల్‌హాసన్‌కు తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీచేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ షూటింగ్‌లో పాల్గొనడంపై తమిళనాడు ఆరోగ్యశాఖ సీరియస్‌ అయింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి షూటింగ్‌ చేయడం సరికాదని, ఈ చర్యపై తక్షణమే వివరణ ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేయనుంది.

CLICK HERE!! For the aha Latest Updates