అమీర్ ఖాన్ తో రాజమౌళి!

టాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు రాజమౌళి. ఆయన కెరీర్ లో ఇప్పటివరకు ఫ్లాప్ అనే మాటే లేదు. బాహుబలి చిత్రంతో ఆయన క్రేజ్ దేశసరిహద్దులను సైతం దాటేసింది. ఇప్పుడు ప్రేక్షకులంతా బాహుబలి2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తరువాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడనే విషయంలో తాజాగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి బాహుబలి వంటి భారీ సినిమా తరువాత ఆయన మహాభారతం, గరుడ వంటి చిత్రాలను లైన్ లో పెట్టినట్లు కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. అయితే వీటిని పక్కన పెట్టి ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్.

అమీర్ ఖాన్ కోసం రాజమౌళి స్టోరీ లైన్ సిద్ధం చేస్తున్నారంటూ.. బాలీవుడ్ లో కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో రాజమౌళి మాత్రం బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచన లేదని తెలుగులో తీయాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈ విషయాన్ని ఆయన ఖండిస్తారో.. లేదో.. చూడాలి!