HomeTelugu Trending'గని' కొత్త విడుదల తేదీ వచ్చేసింది

‘గని’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది

Ghani new release date anno
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’. ఈ మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ చిత్రం డిసెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. అయితే ముందు ‘పుష్ప’, తోడుగా ‘శ్యామ్ సింగ రాయ్’ నుంచి పోటీ గట్టిగా ఉండడంతో గని సినిమా వాయిదా పడింది. ఈ మేరకు కొత్త పోస్టర్ తో పాటు న్యూ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు.

2022 మార్చి 18న ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉందని మేకర్స్ ఈరోజు ప్రకటించారు. వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కన్పించడం సినిమాపై ఇప్పటికే హైప్‌ని సృష్టించింది. ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ‘గని’కి కిర‌ణ్ కొర్రపాటి రచించి, దర్శకత్వం వహించారు. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ టైటిల్ క్యారెక్టర్‌లో కన్పిస్తుండగా, సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు. సంగీతం తమన్ అందిస్తున్నాడు.

Varun tej Ghani In Theatres march 18th 2022

Recent Articles English

Gallery

Recent Articles Telugu