HomeTelugu Trending‘అనుభవించు రాజా' నుండి ‘బతికేయ్‌ హాయిగా’సాంగ్‌ రిలీజ్‌

‘అనుభవించు రాజా’ నుండి ‘బతికేయ్‌ హాయిగా’సాంగ్‌ రిలీజ్‌

BathikeHaayiga Lyrical Song

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాట బయటకు వచ్చింది. ‘‘బతికేయ్‌ హాయిగా’’ అంటూ సాగే ఈ పాటకు భాస్కర భట్ల సాహిత్యం అందించగా దీపు ఆలపించారు.

గోపీసుందర్‌ సంగీతం అందిచారు. వినోదాత్మక కథాంశంతో కుటుంబం మొత్తం మెచ్చేలా రూపొందిన చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో రాజ్‌ తరుణ్‌.. ఎలాంటి ఉద్యోగం చేయకుండా పెద్దలు సంపాదించిన డబ్బుని దుబారాగా కోళ్ల పందెలు కోసం ఖర్చు పెట్టే యువకుడిగా కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu