HomeTelugu Trending'గని' ఫస్ట్‌ గ్లింప్స్‌

‘గని’ ఫస్ట్‌ గ్లింప్స్‌

Glimpse of Ghani First Punc

హీరో వరుణ్‌ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గని’‌‌. బాక్సింగ్‌ నేపథ్యం కథతో తెరకెక్కతున్న ఈ సినిమాకి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి, నవీన్‌ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ‘ఫస్ట్‌ పంచ్‌’ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో కండలు తిరిగిన దేహంతో వరుణ్‌తేజ్‌ కనిపించారు. ‘‘తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించేలా చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాం. ఇందులో వరుణ్‌ బాక్సర్‌గా కనిపిస్తారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌ పూర్తిగా మార్చుకున్నారు’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ‘గని’ చిత్రాన్ని డిసెంబరు 3న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu