HomeTelugu Trendingహారర్‌ థ్రిలర్‌తో సమంత!

హారర్‌ థ్రిలర్‌తో సమంత!

8 25
కోలీవుడ్‌లో హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో అశ్విన్ శరవణన్ సిద్ధహస్తుడు. ఆయన రూపొందించిన ‘మాయ’ (మయూరి) ‘గేమ్ ఓవర్’ చిత్రాలు రెండూ కూడా హారర్ థ్రిల్లర్ చిత్రాలే. ఈ రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలను తెరకెక్కించిన అశ్విన్ శరవణన్, తాజాగా మరో సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ సమంతను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ జోనర్లో ఉంటుందోననే ఆసక్తి ఏర్పడింది. ఈ సారి కూడా అశ్విన్ శరవణన్ హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథనే ఎంచుకున్నాడట. అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తిస్తూ, అనుక్షణం భయపెట్టే పాత్రలోనే సమంత కనిపించనుందని సమాచారం. తమిళంతో పాటే తెలుగులోను ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ‘రాజుగారి గది 2’ వంటి హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటించిన అనుభవం ఉంది. అయితే ఈ హారర్ మూవీలో ఒక రేంజ్ లో భయపెట్టేయడం ఖాయమనే అనుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu