HomeTelugu Big Stories'లైగర్‌' గ్లింప్స్‌ విడుదల

‘లైగర్‌’ గ్లింప్స్‌ విడుదల

Glimpse of LIGER

టాలీవుడ్‌ రౌడా హీరో విజయ్‌ దేవకకొండ నటిస్తోన్న తొలి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘లైగర్‌’. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గింప్స్‌, టీజర్‌ల కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుక్రవారం ఉదయం.. ‘లైగర్‌’ ఫస్ట్‌ గింప్స్‌ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

‘లేడీస్ అండ్‌ జెంటిల్‌మేన్‌ మీ అందరూ ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఈ గింప్స్‌లో ప్రతి సీన్‌ అదరగొట్టేలా సాగింది. ‘వి ఆర్‌ ఇండియన్స్‌’ అంటూ విజయ్‌ చెప్పే డైలాగ్‌లు, యాక్షన్‌ సన్నివేశాల్లో ఆయన నటన మెప్పించేలా ఉంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనన్యపాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ ఈసినిమాలో కీ రోల్‌ పోషించారు. ఛార్మి, కరణ్‌ జోహర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu