HomeTelugu Trending‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’గా వస్తున్న గోపీచంద్‌

‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’గా వస్తున్న గోపీచంద్‌

Gopi chand movie title pak

గోపీచంద్‌ హీరోగా మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేస్తూ.. ఈ మూవీ యూనిట్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మార్చి 5 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్‌, యూవీ క్రియేష‌న్స్ ప‌తాకాల‌పై బ‌న్నీ వాస్ నిర్మాత‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా ‘అక్టోబ‌ర్ 1’న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించే అవకాశం కనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu