HomeTelugu Trendingట్రాన్స్‌జెండర్‌గా ఆదాశర్మ..

ట్రాన్స్‌జెండర్‌గా ఆదాశర్మ..

2 19

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్‌ ఎటాక్’ మూవీతో నితిన్ సరసన హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది ఆదాశర్మ. ఆ తర్వాత పెద్దగా గుర్తింపు రాక చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ హాట్‌ ఫొటోలతో కుర్రకారుకి అందాల విందు చేస్తూ ఉంటుంది. తరచూ హాట్ ఫొటోషూట్‌లు, హాట్ విన్యాసాలను చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఈ భామకు ఇప్పుడు ఓ మంచి అవకాశం వచ్చింది. త్వరలో లింగమార్పిడి కథాంశంతో తెరకెక్కే ‘మ్యాన్ టు మ్యాన్’ మూవీలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో పుట్టుకతో అబ్బాయి అయిన ఆదాశర్మ పాత్ర.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. కానీ ఈ విషయం తెలియని హీరో ఆదాను పెళ్ళి చేసుకుంటాడట. పెళ్ళయిన తర్వాత ఆమె కథ తెలుసుకున్న భర్త ఖంగు తింటాడని సమాచారం. లింగమార్పిడిపై మన సమాజంలో ఉన్న చిన్నచూపు.. అలాంటి శస్త్రచికిత్స ద్వారా మారిన వ్యక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను చూపిస్తూ అదే సమయంలో అంతర్లీనంగా సమాజానికి ఓ సందేశం ఇవ్వబోతున్నాడు దర్శకుడు అబీర్ సేన్ గుప్తా.

Recent Articles English

Gallery

Recent Articles Telugu