HomeTelugu Trending'సీటీమార్‌' లో కామెడీ ట్రాక్‌ హైలైట్‌!

‘సీటీమార్‌’ లో కామెడీ ట్రాక్‌ హైలైట్‌!

6 8

టాలీవుడ్‌ యాక్షన్ హీరోల్లో గోపీచంద్ ఒకరు. ఆయన సినిమాల్లో ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా ఏ అంశాలు ఉన్నప్పటికీ యాక్షన్ పాళ్లే ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ సారి ఆయన కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ ‘సీటీమార్’ సినిమా చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా కనిపించనుంది.

కబడ్డీ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. కథా పరంగా యాక్షన్ .. ఎమోషన్ ఎక్కువగా వుంటాయనే ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ సినిమాలో కామెడీ కూడా కావలసినంత ఉంటుందని చెబుతున్నారు. గోపీచంద్ – వెన్నెల కిషోర్ కి మధ్య నడిచే కామెడీ ట్రాక్ ఆద్యంతం నవ్విస్తుందని అంటున్నారు. సెకండాఫ్ కామెడీ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu