HomeTelugu Trendingగోపీచంద్‌ 'రామబాణం' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

గోపీచంద్‌ ‘రామబాణం’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Gopichands Rama Banam locks its release date deets here

టాలీవుడ్‌ హీరో గోపీచంద్, యంగ్‌ డైరెక్టర్‌ శ్రీవాస్ ల కాంబినేషన్‌లో వస్తున్న ఫామిలీ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘రామబాణం’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు రెండూ కూడా పెద్ద సక్సెస్ సాధించాయి.దీంతో రామబాణం కూడా అంచనాలు ఏర్పడ్డాయి.

డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు, ఖుష్బూ, సచిన్ ఖేడేకర్, నాజర్, ఆలీ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ సినిమాపై మంచి బజ్‌నే క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది చిత్రబృందం.

మే 5న సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఈ పోస్టర్‌ లో బాగా చదవండి. పరీక్షలు ఇంకా బాగా రాయండి. వేసవి సెలవుల్లో కలుద్దాం.. అంటూ కాప్షన్‌ను ఇచ్చారు. గతకొంత కాలంగా సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్నారు గోపీచంద్‌, డైరెక్టర్‌ శ్రీవాస్‌. మరీ ఈ సినిమా వీరికి ఎంతవరకు ప్లస్‌ అవుతుందో చూడాలి.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu