‘గౌతమ్ నంద’ ఫస్ట్ లుక్!

మాస్ హీరో గోపీచంద్, స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గౌతమ్ నంద’. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన లభించింది. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న గోపీచంద్ గెటప్ అందరినీ అలరించింది. నేడు మహాశివరాత్రి సందర్భంగా మరో స్టైలిష్ పోస్టర్ ను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “ఇటీవల విడుదల చేసిన గోపీచంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. శివరాత్రి సందర్భంగా సరికొత్త లుక్ ను విడుదల చేశాం. ఈ సరికొత్త పోస్టర్ లో గోపీచంద్ మరింత స్టైలిష్ గా కనిపించడానికి కారకుడు దర్శకుడు సంపత్ నంది. ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని గోపీచంద్ క్యారెక్టర్ ను, స్టైలింగ్ ను సరికొత్తగా ఎలివేట్ చేశాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. రామ్, లక్ష్మణ్ ల నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నాం. ఫైట్ సీన్స్ కోసం గోపీచంద్ నాలుగు రోజులపాటు రిహార్సల్ చేయడంతో.. మూడు నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయగలిగాం. తెలుగులో ఈ విధంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయడం అనేది ఇదే ప్రప్రధమం. ఒక హీరోగా గోపీచంద్ కమిట్ మెంట్ కు నిదర్శనం ఇది. మార్చిలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నాం” అన్నారు.