తమిళంలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’!

తెలుగులో ఘన విజయం సాధించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ఆర్.ఎన్.సి ఫిల్మ్స్ పతాకంపై తమిళంలో డబ్బింగ్ చేసి అతి త్వరలో భారీ ఎత్తున తమిళనాట విడుదల చేయబోతున్నారు. బాహుబలి2 చిత్రం విడుదల తరువాత విడుదల కాబోతున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రంపై తమిళనాట విపరీతమైన క్రేజ్ ఏర్పడడం, ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎదురుచూడడం ఆనందంగా ఉందని నిర్మాతలు తెలిపారు.

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో నిలిచిపోయే చిత్రంగా ఈ సినిమా ఆయన అధ్బుత నటనను కనబరిచారు. తమిళ ఆడియోను, చిత్రాన్ని జూన్ నెలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సుజాత పుత్ర రఘునాథ్, నిర్మాత: సుజాత పుత్ర నరేంద్ర, మాటలు, పాటలు: మరుదు భరణి, వైరు ముత్తు, దర్శకత్వం: అంజనాపుత్ర క్రిష్