ఛాన్స్ వస్తే మాధురీ దీక్షిత్ ను పెళ్లాడతా!

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ వివాదాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. 1990లలో మాధురీ దీక్షిత్ తో కలిసి సంజయ్ దత్ సినిమాలు చేస్తోన్న సమయంలో ఆమెతో సంజయ్ ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి. అంతేకాదు ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని సమాచారం. కానీ కొన్ని కారణాల వలన ఇద్దరూ కూడా ఒకరికొకరు దూరమయ్యారు. ఆ తరువాత మాధురీ దీక్షిత్ ఓ డాక్టర్ ను వివాహమాడింది.

సంజయ్ కూడా ప్రస్తుతం మాన్యత దత్ తో జీవితం సాగిస్తున్నారు. అయితే ఇటీవల గోవాలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరయ్యారు సంజయ్ దత్. అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చాడు. ‘మీకు ఇప్పుడు మరోసారి పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని పెళ్లి చేసుకుంటారని అడిగారు’ దీనికి సమాధానంగా ఆయన తడుముకోకుండా.. మాధురీ దీక్షిత్ అని టక్కున చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత తాను సరదాగా అన్నానని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here