
మలయాళీ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మాస్టర్ పీస్’. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని ‘గ్రేట్ శంకర్’ పేరుతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈరోజు ఉదయం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇందులో మమ్ముట్టి కళాశాలలో అధ్యాపకుడిగా యంగ్ లుక్‌లో కనిపించనున్నారు. అలాగే నటి వరలక్ష్మి శరత్ కుమార్ పోలీస్ అధికారిగా పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా ఈసినిమాలో నటించారు.













