
India’s First Recording Artist remuneration:
భారతీయ సంగీతాన్ని కాలంతో పాటు మారుతూ వస్తోంది. యాపిల్ మ్యూజిక్, జియోసావన్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ఇప్పుడు పాటలు సులభంగా అందుబాటులో ఉన్నాయి. కానీ క్యాసెట్‌లు, సీడీలు కూడా రాకముందు, సంగీత ప్రియుల్ని మంత్ర ముగ్ధుల్ని చేసిన అద్భుతమైన పరికరం గ్రామోఫోన్.
ఈ గ్రామోఫోన్‌లో తొలిసారిగా రికార్డయిన భారతీయ గాయకురాలు ఎవరో తెలుసా? గౌహర్ జాన్.. గౌహర్ జాన్ – అసలు పేరు ఏలీన్ యాంజెలినా. జూన్ 26, 1873 న ఆజమ్‌గఢ్ లో జన్మించిన గౌహర్ అసలు పేరు ఏలీన్ యాంజెలినా యోవార్డ్. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్న తర్వాత, తల్లి విక్టోరియా హేమింగ్స్ తన పేరును మల్కా జాన్ గా మార్చుకుంది. చిన్న ఏలీన్ బనారస్ కు వచ్చి గౌహర్ జాన్ గా మారింది.
ఇక్కడే ఆమెకు సంగీత, నృత్య విద్యలు నేర్పించారు. ఆమె గాత్ర కమ్మదనం చూసి కోల్‌కతాలో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.
1902లో గౌహర్ జాన్ భారతదేశపు మొట్టమొదటి రికార్డింగ్ ఆర్టిస్ట్ అయ్యింది. కాలకత్తాలో గ్రామోఫోన్ కంపెనీ స్టూడియోలో ఆమె పాట రికార్డ్ చేశారు. 3 నిమిషాల పాట పూర్తయ్యాక, ఆమె గర్వంగా – “మై నేమ్ ఈజ్ గౌహర్ జాన్!” అని చెప్పింది. ఆమె ఈ విధంగా తన పాటలను గుర్తింపు పొందేలా చేసింది.
1902-1920 మధ్య గౌహర్ జాన్ దాదాపు 600 పాటలను 10 భాషల్లో రికార్డ్ చేసింది. హిందీ, బెంగాలి, తమిళం, ఫ్రెంచ్ వంటి భాషల్లో పాటలు పాడింది.
ఆమె ఒక్కో పాటకు రూ. 3,000 అందుకునేది. ఆ రోజుల్లో 10 గ్రాముల బంగారం కేవలం రూ. 20 మాత్రమే ఉండేది! ఈ లెక్కన ఆమె ఎంత డబ్బు సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు.
ఆమె బంగారు నగలు, భారీ విందులు, చరిత్రలో నిలిచిపోయే స్టైల్ లో జీవించింది. ఓసారి తన పిల్లి పిల్లల కోసం రూ. 20,000 ఖర్చుపెట్టారట!
అయితే, ఆమె జీవితం పోరాటాలతో, మోసాలతో నిండిపోయింది. చివరికి దివాళా తీయాల్సి వచ్చింది. మైసూర్ రాజు కోర్ట్ సంగీత విద్వాంసురాలిగా నియమించుకున్నా, ఆమె అనాథగా మారింది. 1930 జనవరి 17న తుది శ్వాస విడిచారు.
ALSO READ: Pushpa 2 నే డామినేట్ చేసేసిన Daaku Maharaaj.. ఎక్కడంటే