
Jayasudha Shobhan Babu:
శోభన్ బాబు టాలీవుడ్‌లో ఒక లెజెండరీ హీరోగానే కాకుండా, మంచి వ్యాపార దృష్టి ఉన్న వ్యక్తిగా కూడా పేరుగాంచారు. సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ఆయన ఎప్పుడూ తన డబ్బును సరైన రీతిలో పెట్టుబడులు పెట్టే వాడని టాలీవుడ్ సీనియర్స్ చెబుతుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో ఆయనది అందె వేసిన చెయ్యి.
ఇటీవల జయసుధ ఒక ఇంటర్వ్యూలో శోభన్ బాబు ఇచ్చిన ఒక సలహా గురించి చెప్పుకొచ్చారు. “ఒకసారి మేము చెన్నైలో షూటింగ్‌కు వెళితే, కారులో వస్తున్నప్పుడు శోభన్ బాబు చెప్పారు – ‘ఏమోయ్ నీకు ఒక మంచి స్థలం చూపిస్తాను, మీ నాన్నగారికి చెప్పి కొను’ అని. కానీ అప్పుడు మా వారు చూసి, అది డంపింగ్ యార్డ్ అని వదిలేశారు,” అని చెప్పుకొచ్చారు.
అయితే శోభన్ బాబు అలా చెప్పినది వృథా కాలేదు. అదే స్థలం ఇప్పుడు చెన్నైలో అతి విలువైన ప్రదేశంగా మారిపోయింది – అన్నా నగర్! ప్రస్తుతం అక్కడ ఒక ఎకరం స్థలం విలువ సుమారు రూ.100 కోట్లు. జయసుధ ఇది గుర్తు చేసుకుని, “అప్పుడు శోభన్ బాబు మాట వినివుంటే, నాకిప్పుడు లైఫ్ సెటైపోయేది” అని చెప్పుకొచ్చారు.
ఈ విషయంపై నెటిజన్లు, “పెద్దల మాట వినాలి,” “శోభన్ బాబు నిజమైన ఫైనాన్షియల్ ప్లానర్,” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కాకుండా, శోభన్ బాబు తనకే కాదు, తనతో నటించే వారికీ కూడా మంచి పెట్టుబడుల గురించి సలహాలు ఇచ్చేవారని తెలుస్తోంది. ఆయన చెప్పిన మాటలు విన్న వారంతా బాగా లాభపడినట్లు సమాచారం.
సినిమాల్లోనే కాదు, జీవితంలో కూడా శోభన్ బాబు తెలివిగా వ్యవహరించేవారని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది!