HomeTelugu Trendingమహేష్‌ ఇంట 'గుంటూరు కారం' సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

మహేష్‌ ఇంట ‘గుంటూరు కారం’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌

guntur kaaram 4ఈ సంక్రాంతికి మహేష్‌బాబు హీరోగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమా విడుదలైన సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ మహేష్‌ బాబు ఇంట్లో సందడిగా జరిగాయి. ఈ వేడుకల్లో దిల్‌ రాజు దంపతులు, నిర్మాత నాగవంశీ, హీరోయిన్లు శ్రీలీల, మీనాక్షి చౌదరి పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో సితార ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన మహేశ్‌ బాబు.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ ‘బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌’ అనే క్యాప్షన్‌ను జోడించారు.

guntur kaaram1

మహేశ్‌ బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమణ పాత్రలో మహేశ్‌ మాస్ లుక్‌లో అలరించగా.. శ్రీలీల డ్యాన్స్‌తో జోష్‌ పెంచింది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ, జయరామ్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించి సినిమాకి మంచి హైప్‌ని క్రియేట్‌ చేశారు. మూడు రోజుల్లో రూ.164 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రబృందం పేర్కొంది.

Guntur Kaaram success cel

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu