HomeTelugu Big Storiesఐటెమ్‌ సాంగ్సే బెటర్: హంసానందిని

ఐటెమ్‌ సాంగ్సే బెటర్: హంసానందిని

5 25
హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ఆ తర్వాత ఐటెమ్‌ సాంగులకు పరిమితమైంది. ఎన్నో సినిమాల్లో తన ఐటెమ్‌ సాంగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఐటెమ్‌ సాంగ్స్ పై స్పందించింది.

హీరోయిన్ గా రొటీన్ పాత్రలే తనకు వచ్చాయని… ఆ పాత్రలు తనకు నచ్చకపోవడంతో, ఐటెమ్‌ సాంగ్స్ వైపు మొగ్గు చూపినట్లు చెప్పింది. ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రల కంటే ఐటెమ్‌ సాంగులే బెటర్ అని తెలిపింది. స్పెషల్ పాటలు రొటీన్ కు భిన్నంగా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని తెలిపింది. తనకు సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని… అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని తెలిపింది. ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu