రిజిస్ట్రార్ ఆఫీస్ లో ప్రియమణి పెళ్లి!

తెలుగు తెరపై అందాల కథానాయికగా మెరిసినవారిలో ప్రియమణి ఒకరు. తమిళ .. మలయాళ .. కన్నడ భాషా చిత్రాల్లోను ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. చాలా కాలంగా ప్రియమణి, వ్యాపారవేత్త ముస్తాఫా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి నిశ్చితార్ధం కూడా జరిగింది. ఈ నెల 23న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. దీంతో ఆమె పెళ్లి అట్టహాసంగా జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ ఇద్దరూ రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోనున్నారు. 24వ తేదీన ఇండస్ట్రీ ప్రముఖులను.. తన తోటి నటీనటులకు గ్రాండ్ గా బెంగుళూరులో ఓ పార్టీ ఏర్పాటు చేసిందట.

కొంతమంది కథానాయికలు ఎంతో ఆడంబరంగా వివాహం చేసుకుంటూ ఉంటే .. ప్రియమణి ఇలా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లికి సిద్ధపడటం ఆశ్చర్యమే. ప్రస్తుతం ప్రియమణి మలయాళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది. పెళ్ళయిన తరువాత కూడా సినిమాల విషయంలో గ్యాప్ తీసుకోకూడదని ఆమె భావిస్తోంది.