హన్సిక టాలీవుడ్ కు షిఫ్ట్ అవుతోందా..?

అందాల తార హన్సిక తెలుగులో ‘దేశముదురు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.    ఎప్పుడైతే అమ్మడుకి తెలుగులో అవకాశాలు రావడం తగ్గాయో.. వెంటనే తన మకాం ను కోలీవుడ్ కి షిఫ్ట్ చేసింది. బొద్దు భామలను బాగా ఇష్టపడే తమిళ తంబీలు హన్సికకు ఫిదా అయిపోయారు. అమ్మడుకు ఏకంగా గుడి కూడా కట్టించేశారు. అయితే అతి త్వరలోనే మళ్ళీ ఈ భామకు  హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాలనుకుంటుందని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

తమిళంలో తన హవా సాగిస్తోన్న తరుణంగా కొత్తగా వస్తోన్న హీరోయిన్ల నుండి హన్సికకు గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో అమ్మడు తన దృష్టి  తెలుగు సినిమాలపై పెడుతోంది. అలా ప్రస్తుతం గోపిచంద్ సరసన ఒక సినిమా, మంచు విష్ణు సరసన మరో సినిమాలో నటిస్తోంది. ఈ రెండు  కాకుండా మరికొన్ని తెలుగు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయట. అంతేకాదు తెలుగు  సినిమాల కోసం అమ్మడు తన బరువుని కూడా  తగ్గించుకొని సన్నబడింది. దీంతో ఇక హన్సిక తెలుగుకి షిఫ్ట్ అవ్వడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.