HomeTelugu Trending'హనుమాన్' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘హనుమాన్’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Hanuman movie trailer relea

టాలీవుడ్‌ యంగ్ హీరో తేజా సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హనుమాన్‌’. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో తొలి సూపర్ హీరో మూవీగా హనుమాన్ వస్తోంది. జనవరి 12వ తేదీన 11 భాషల్లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇటీవల వరుసగా పాటలు తీసుకొస్తూ మూవీ యూనిట్ ప్రమోషన్లను జోరుగా చేస్తోంది. ఈ క్రమంలో హనుమాన్ ట్రైలర్ రిలీజ్ డేట్‍ను కూడా ప్రకటించింది.

హనుమాన్ సినిమా ట్రైలర్‌ డిసెంబర్ 19వ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం రోజుల్లోనే ఇప్పటి వరకు అప్‍డేట్లను, పాటలను రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. ట్రైలర్ విషయంలోనూ ఇదే ఫాలో అవుతోంది. ట్రైలర్ డేట్ అనౌన్స్‌మెంట్‍ను నేడు (డిసెంబర్ 9) చేయగా.. వచ్చే మంగళవారం (డిసెంబర్ 19) హనుమాన్ ట్రైలర్ రానుంది.

హనుమంతుడి వల్ల అతీత శక్తులు వచ్చే యువకుడి పాత్రలో సూపర్ హీరోగా హనుమాన్ మూవీలో తేజ సజ్జా నటించారు. అంజనాద్రి అనే ప్రాంతంలో ఈ కథ జరుగుతుంది. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‍గా నటిస్తుంది. వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య కీలకపాత్రలు పోషించారు.

ప్రైమ్ షో ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై హనుమాన్ చిత్రాన్ని కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌడ, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 12వ తేదీన హనుమాన్ రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీతో పాటు విదేశీ భాషలు ఇంగ్లిష్, చైనీస్, జపనీస్, స్పానిష్, కొరియన్‍లోనూ హనుమాన్ విడుదల కానుంది.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu