HomeTelugu Trendingచావు కంటే పెద్ద శిక్ష ఏదైనా ఆలోచించాలేమో..

చావు కంటే పెద్ద శిక్ష ఏదైనా ఆలోచించాలేమో..

2 28

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో డిగ్రీ విద్యార్థిని దేవిక అనుమానాస్పద మృతి పట్ల స్థానికులు భగ్గుమంటున్నారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినదిస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘటనపై నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. జస్టిస్ ఫర్ దేవిక పేరును ట్రెండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు జస్టిస్ ఫర్ దేవిక అనే హ్యాష్ ట్యాగ్‌తో రైజ్ యువర్ వాయిస్ అంటూ దర్శకుడు హరీష్ శంకర్‌, హీరో విజయ్ దేవరకొండ, హీరో నితిన్‌లకు ట్వీట్ చేశారు.

తాజాగా దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్‌లో స్పందించాడు. ‘ఎన్‌కౌంటర్ చేసినా బుద్ధి రావడం లేదు. అంటే ఇంకా పెద్ద పనిష్‌మెంట్ ఏదైనా ఆలోచించాలేమో’ అంటూ ట్వీట్‌ చేశాడు. నిజమే చావు కంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది..ఇలా కూడా మారకపోతే ఇంకేం శిక్ష వేయాలి అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నితిన్ , విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి .

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!