హెబ్బా బాలీవుడ్ ఆశలు!

‘అలా ఎలా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయి ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న నటి హెబ్బా పటేల్. ఇప్పటివరకు హెబ్బా కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా… యంగ్ హీరోలతో ఓ మోస్తరు హిట్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి ‘మిస్టర్’ సినిమా నటిస్తోన్న ఈ భామ ఇప్పటినుండే బాలీవుడ్ లో సెటిల్ అయిపోవాలని కళలు కంటోంది. దీనికోసం తనకు తెలిసిన బాలీవుడ్ సర్కిల్స్ తో కాంటాక్ట్ మైంటైన్ చేస్తోందట. ఏ నటికైనా.. మంచి హిట్స్ పడితే చాలు బాలీవుడ్ కు వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంటారు.

అక్కడ వచ్చే రెమ్యూనరేషన్, పాపులారిటీ ఆ రేంజ్ లో ఉంటాయ్ మరి. కానీ సౌత్ నుండి వెళ్ళిన చాలా మంది హీరోయిన్స్ కు బాలీవుడ్ కలిసి రాలేదు. మరో హెబ్బా మాత్రం ఆ సెంటిమెంట్ ను పక్కన పెట్టేసి తన అధృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది. మరి ఆమె కోరుకున్నట్లుగా బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకుంటుందో.. లేదో.. చూడాలి!