పవన్, బన్నీల మధ్య కోల్డ్ వార్!

మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు సినిమా ఇండస్ట్రీలో మరే కుటుంబంలోని లేరు. వీరిలో ఒక హీరో సినిమా ఆడియో ఫంక్షన్ అవుతుందంటే చాలు వీలుచూసుకొని కుటుంబంలో అందరూ హాజరయ్యేలా చూసుకుంటారు.. ఒక్క పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తప్ప.

పవన్ ను మెగా కుటుంబంలో అందరూ పొగుడుతూ ఉన్నా.. ఆయన మాత్రం ఎవరితోనూ అంత క్లోజ్ గా ఉన్నట్లు కనిపించడు. తాజాగా అల్లు అర్జున్ కి పవన్ కల్యాణ్ కి మాటల్లేవని తెలుస్తోంది. మొన్నామధ్య బన్నీ స్టేజ్ మీద చెప్పను
బ్రదర్ అనే డైలాగ్ పవన్ కల్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురిచేసింది.

అప్పటినుండే బన్నీ, పవన్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాక్. అయితే అంతకముందు నుండే బన్నీకు పవన్ కు మధ్య పెద్దగా మాటల్లేవని ‘చెప్పను బ్రదర్’ ఎపిసోడ్ తో దూరం ఇంకాస్త పెరిగించని తెలుస్తోంది. అల్లు అరవింద్ కు, పవన్ కు మధ్య రిలేషన్ కూడా పెద్దగా ఉండేది కాదట. ఆ ప్రభావం బన్నీపై కూడా పడుతుందని టాక్. మరి ఇకనైనా ఈ ఇద్దరి హీరోల మధ్య దూరం తరిగి ఒక్కటవుతారేమో చూడాలి!