
Priyanka Chopra Remuneration 2025:
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా చాలా సంవత్సరాల తర్వాత హిందీ సినిమాల్లోకి మళ్లీ అడుగుపెడుతోంది. గత కొన్ని ఏళ్లుగా హాలీవుడ్ సినిమాలపై దృష్టి పెట్టిన ఆమె ఇప్పుడు ఇండియాలో రెండు మేజర్ ప్రాజెక్టులతో రీ ఎంట్రీ ఇస్తోంది. అవే SSMB29 (మహేష్ బాబు హీరోగా) మరియు Krrish 4 (హృతిక్ రోషన్‌తో కలిసి).
ఈ రెండు సినిమాలకూ ప్రియాంక భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. SSMB29 కోసం ఆమె తీసుకుంటున్న పారితోషికం రూ. 30 కోట్లు అని టాక్. ఇక Krrish 4 కోసం ఆమెకు రూ. 20-30 కోట్లు లేదా లాభాల్లో భాగస్వామ్యం కూడా ఉండొచ్చని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Krrish 4 విషయానికొస్తే – ఇది సూపర్ హీరో సినిమాగా రాబోతుంది. హృతిక్ రోషన్ ఈసారి హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నాడు. ప్రియాంక తన పాత క్యారెక్టర్ అయిన ప్రియాగా మళ్లీ కనిపించనుంది. మరింత ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే… ‘కోయి మిల్ గయా’లోని జాదూ ఈ సినిమాతో తిరిగి రాబోతున్నాడట!
ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. 2026 మొదట్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌లు, ప్రియాంక తిరిగి హిందీ సినిమాల్లోకి రావడం, ఆమె భారీ రెమ్యూనరేషన్ పక్కనపెడితే.. ఫ్యాన్స్ మాత్రం Krrish 4లో హృతిక్–ప్రియాంక కెమిస్ట్రీ మళ్లీ చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.













