HomeTelugu Trendingవిడాకులు తరువాత తొలిసారి కలుసుకున్న ధనుష్‌- ఐశ్వర్య

విడాకులు తరువాత తొలిసారి కలుసుకున్న ధనుష్‌- ఐశ్వర్య

Hero Dhanush and aishwarya

తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నా సంగతి తెలిసిందే. తన అల్లుడు, కూతురు విడిపోకుండా ఉండేందుకు రజనీ తనవంతు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఐశ్వర్య, ధనుష్ లు విడాకులు తీసుకుని ఎవరికి వారు బతుకుతున్నారు. తాజాగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికిన పలికిన ఈ జంట తాజాగా ధనుష్, ఐశ్వర్య తొలిసారి కలుసుకున్నారు.

ధనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు యాత్ర, రెండో కొడుకు పేరు లింగా. తాజాగా యాత్రకు సంబంధించిన కార్యక్రమం కోసం వీరిద్దరూ అతని స్కూల్ కు వెళ్లారు. పెద్ద కొడుకు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ అవడంతో… వీరిద్దరూ దగ్గరుండి ఆ ఈవెంట్ ను వీక్షించారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!