విడిపోతున్నట్టు ప్రకటించిన ధనుష్‌-ఐశ్వర్య దంపతులు

తమిళ స్టార్‌ హీరో ధనుష్, అతని భార్య ఐశ్వర్య (సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు) విడిపోతున్నట్లు ప్రకటించారు. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ట్విట్టర్‌లో వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేసి అభిమానులను ఆశ్చర్య పరిచారు. లోపల పేరు మార్పు తప్ప ఇద్దరిదీ ఒకే ప్రకటన.


స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి. ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో..  ఐశ్వర్యా రజనీకాంత్‌ తన లేఖలో పేర్కొన్నారు.

ధనుష్‌ సోదరికి ఐశ్యర్య మంచి స్నేహితురాలు. దాంతో ధనుష్, ఐశ్వర్యల మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించడంతో నవంబరు 18, 2004 వీరి వివాహం జరిగింది. ఈ జంటకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య మొదటి సారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్‌ హీరోగా థ్రిల్లర్‌ సినిమా ‘3’ని తెరకెక్కించారు.

CLICK HERE!! For the aha Latest Updates