HomeTelugu Trendingటైటిల్ వేటలో నాని 30వ సినిమా

టైటిల్ వేటలో నాని 30వ సినిమా

Nani 30th movie title searc
నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తన 30వ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నాని పక్కన మృణాల్ ఠాకూర్ హీరోయిన్. మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు శౌర్యన్ పరిచయమవుతున్నాడు.

నాని 30వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఓ తండ్రీ, కూతురి మధ్య అనుబంధం, రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే ఎమోషన్స్‌తో కూడిన కథ. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇప్పటికే చాలా టైటిల్స్ పరిశీలించారు. వాటిలో మూడు టైటిల్స్‌ను ప్రధానంగా అనుకుంటున్నారు.

హలో డాడీ .. హలో నాన్న .. హాయ్ నాన్న అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ మూడింటిలో ఒకటి సెలెక్ట్ చేసి, టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి హేషం అబ్దుల్ సంగీతం. టైటిల్ ఖరారు చేశాక ప్రమోషన్స్ మొదలెట్టనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!