HomeTelugu Trendingషూటింగ్‌లో గాయపడ్డ హీరో నిఖిల్‌

షూటింగ్‌లో గాయపడ్డ హీరో నిఖిల్‌

Hero nikhil injured in kar
టాలీవుడ్‌ యంగ్‌ నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం గుజరాత్‌లో ‘కార్తికేయ 2’ షూటింగ్‌ జరుగుతోంది. చిత్రీకరణ జరుగుతుండగా నిఖిల్ ప్రమాదానికి గురయ్యాడు. ఒక మెయిన్ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. నిఖిల్‌కి స్వల్ప గాయాలయ్యాయి.. కాలుకి గాయం అవ్వడం వలన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించడం ఆపివేశారు. మరికొన్ని రోజులు ఈ యాక్షన్ సీన్స్‌కి నిఖిల్ దూరంగా ఉండబోతున్నారని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం నిఖిల్ బాగానే ఉన్నారని తెలిపారు. చందు మెుండేటి డైరెక్షన్‌లో నిఖిల్‌ హీరోగా ‘కార్తికేయ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్స్​ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu