‘సాహో’ ఓవర్సీస్ షాకింగ్‌ రైట్స్

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ బాహుబలి తరువాత .. చేస్తున్న మూవీ సాహో. ప్రభాస్ కు జోడిగా ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉన్నది. రీసెంట్ గా దీనికి సంబంధించిన సెకండ్ టీజర్ ను రిలీజ్ చేశారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ గా రాబోతున్న ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా సాహో గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాహో ఓవర్సీస్ హక్కులను యూఏఈ కి చెందిన ఓ సంస్థ రూ.42 కోట్లకు తీసుకున్నట్టు తెలుస్తోంది. బాహుబలి తరువాత ఈ స్థాయిలో ఓవర్సీస్ హక్కులు దక్కించుకున్న సౌత్ సినిమా ఇదే కావడం విశేషం. బాహుబలి 2 రూ.72 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతే.. రూ.170 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.