జనసేనకు హీరో నితిన్‌ భారీ విరాళం!

జనసేన పార్టీకి హీరో నితిన్ భారీ విరాళం ఇచ్చారు. తనకు మైక్ దొరికొతే చాలు తాను పవన్ కల్యాణ్‌ ఫ్యాన్‌ని అని చెప్పుకునే నితిన్… సోషల్ మీడియాలోనూ పవన్‌పై తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీకి తనవంతు సాయంగా… ఈ యంగ్‌ హీరో జనసేన పార్టీ నిధికి రూ.25 లక్షల విరాళంగా ఇచ్చారు. సోమవారం రాత్రి భీమవరంలో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను కలిసిన నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి.. రూ.25 లక్షల చెక్‌ను అందచేశారు. డీ హైడ్రేషన్‌తో అస్వస్థతకుగురైన పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక తన ఆరోగ్య పరిస్థితిపై వాకాబు చేసి, ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం ఇచ్చిన సోదరుడు నితిన్ కు, సుధాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్.