HomeTelugu Newsతరుణ్‌ రీఎంట్రీ!

తరుణ్‌ రీఎంట్రీ!

Hero tarun re entry

లవర్ బాయ్ తరుణ్ బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. నువ్వే కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా 20 ఏళ్ళ కిందే 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. నువ్వే కావాలి, నువ్వే నువ్వే, నువ్వులేక నేనులేను, ప్రియమైన నీకు లాంటి విజయాలు ఈయన రేంజ్ పెంచేశాయి. దాదాపు 20 కోట్ల మార్కెట్ సొంతం చేసుకున్న తర్వాత కొన్ని తొందరపాటు నిర్ణయాలతో ఈయన కెరీర్ దారుణంగా దిగజారిపోయింది. ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోయాడు తరుణ్. కనీసం కనిపించడం కూడా మానేసాడు. చాలా ఏళ్ళ బ్రేక్‌ తరువాత తరుణ్ మరోసారి ఏంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఓ లవ్ స్టోరీతో తరుణ్‌ రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. దీనికి అతడి స్నేహితుడే దర్శకుడు కావడం విశేషం. అంతేకాదు తరుణ్ ఈ సినిమాకు నిర్మాతగా మారనున్నాడని వినికిడి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu